తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి.
Sandhya Theater Case : సంధ్య థియేటర్ ఘటన సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్ను ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసులు, కట్టుదిట్టమైన భద్రతతో, సెషన్ తర్వాత నటుడిని తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విచారణ ముగిసిన వెంటనే తన కారులో ప్రాంగణం…
శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాఫ్ రూం తాళం పగలగొట్టి కొందరు దుండగులు పాఠశాల రికార్డులను తగలబెట్టారు. గదిలో రికార్డులు, పరీక్ష పత్రాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు పాఠశాలలోకి చొరబడి పాఠశాల రికార్డులను ధ్వంసం చేశారు.
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి…
Gun Fire : నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు జరిపారు…
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారు. క్లాస్‌రూమ్‌లో ఉండగానే దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు.
ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్ మీడియా ప్రేమ ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.