Online Betting: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది.
Read Also: Medak: దారుణం.. ప్రియురాలని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై రోజు రోజుకు మరింత డబ్బు పోగొట్టుకున్నాడు. చివరకు రూ.80 లక్షల వరకు నష్టపోయి తీవ్రంగా అప్పులపాలయ్యాడు. అప్పులు తిరిగి చెల్లించాలని అప్పుకు డబ్బులు ఇచ్చినవారు అతనిపై తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఇక జీవితం కొనసాగించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్న వయస్సులోనే ఇద్దరు పిల్లలు తండ్రి ప్రేమను కోల్పోయి అనాథలుగా మారిపోయారు.
Read Also: Israel: లెబనాన్‌లో ఐడీఎఫ్ దాడి.. హమాస్ ఆపరేషన్స్ అధిపతి షాహీన్ హతం
సంజయ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతనిపై అప్పుల వసూళ్లకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగ్ ద్వారా అతను ఎంత మేరకు నష్టపోయాడు? ఎవరి వద్ద ఎంత అప్పులు చేశాడు? ఎవరు అతనిపై ఒత్తిడి తెచ్చారు? అనే కోణాల్లో విచారణ చేపట్టే పనిలో పడ్డారు. ఈ ఘటన మరోసారి బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు లోనవ్వకుండా, ఆర్థికంగా బాధ్యతగా వ్యవహరించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.