అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.
ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చినట్లు తెలిసింది. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏలూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విసిరేసారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఏలూరు అశోక్ నగర్ అమలోద్భవి స్కూల్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు
Dead Body : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో విషాదం నెలకుంది. గోదావరి నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన బొడ్డు సమ్మక్క(65) అనే మహిళ గత నెల 27 న తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాగా మనస్థాపం చెంది ఇంటి నుండి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమే కోసం గాలించగా ఎక్కడ ఆచూకీ లభించలేదు. టేకుమట్ల…
Massive Accident : చేవెళ్ళ ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన లారీ ఫుడ్ పాత్ మీదకి దూసుకెళ్లింది. దీంతో.. ఫుట్ పాత్ మీద కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో.. పదిమందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం. ఇదే కాకుండా.. 20 మందికి పైగా గాయపడ్డట్లగా తెలుస్తోంది. Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్. ఈ ప్రమాద…
Suspects : ఏలూరులో ముగ్గురు యువకులుతుపాకీతో పోలీసులకు పట్టుబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు తుపాకీ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు, ఎలాంటి నేరానికి పాల్పడనున్నారు అనే కోణాల్లో వారిని విచారణ చేస్తున్నారు. ఏలూరు టూటౌన్ కొత్తపేటలో గస్తీ నిర్వహిస్తున్న మహిళా ఎస్సై, సిబ్బందికి రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారు కనిపించింది. లోపల ముగ్గురు యువకులు ఉండటంతో వారిని వివరాలు అడిగారు. వారు చెప్పిన సమాధానాల్లో స్పష్టత లేకపోవడంతో కారంతా గాలించగాతుపాకీ దొరికింది. వెంటనే ఆ…
Murder : విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలసలో వివాహిత హత్య అనుమానిస్తున్నారు. కనకల మధు లక్ష్మి భర్తే హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయవాడకు చెందిన ముని ఆదిబాబుతో తొలిత మధులక్ష్మి వివాహం జరిగింది. అతను చనిపోవడంతో లక్ష్మి తమ కొడుకుతో కలిసి తల్లిదండ్రుల ఊరు లింగలవలసకు వచ్చేసింది. ఇదే క్రమములో గ్రామములో కనకల రామారావు ను వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. లక్ష్మి తన 8 ఏళ్ల…