Gang Rape : కామపిశాచులకు కేరాఫ్.. మతిస్థిమితం లేని మహిళను సైతం వదలని మృగాళ్లు
- మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
- మతిస్థిమితం లేని మహిళ పై లైంగిక దాడి
- మియాపూర్ బొల్లారం x రోడ్ లో మహిళని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి సామూహిక ఆత్యాచారం
- పోలీస్ ల అదుపులో ఇద్దరు నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gang Rape : ఇటీవల అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతుండటం అత్యంత ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఏ వయస్సు వారినైనా లక్ష్యంగా చేసుకుని దుర్మార్గులు తమ కీచక కోరికలు తీర్చుకుంటున్నారు. పాఠశాలలు, కార్యాలయాలు, కూడా మహిళలకు సురక్షిత ప్రదేశాలుగా మారలేని పరిస్థితి ఏర్పడింది. బాలికలు కూడా ఈ దారుణాలకు గురవుతుండటం గమనార్హం. ఇటీవల అనేక స్కూల్ విద్యార్థినులు వారి బంధువుల చేతుల్లోనే అత్యాచారానికి గురవుతున్న దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
TTD: తిరుమలలో ఎట్టకేలకు ముగిసిన వివాదం..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాలు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్లపైన, కార్యాలయాల్లో, అద్దె ఇళ్లలో, విద్యాసంస్థల్లో కూడా ఈ తరహా నేరాలు పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తుంది. రోజుకు ఎన్నో అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. కానీ, వాటిలో చాలా తక్కువ శాతం మాత్రమే దోషులను శిక్షించే వరకు వెళ్తున్నాయి. బాధితులపై సమాజం ఒత్తిడి తెచ్చి వాటిని అణిచివేయడం, పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నేరస్థులు మరింత ధైర్యంగా మారుతున్నారు.
మహిళలు రాత్రివేళ బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి. తమకు రక్షణ ఉండదనే భావనతో జీవించాల్సి వస్తోంది. బాలికల తల్లిదండ్రులు వారి పిల్లలను ఒంటరిగా బయటికి పంపడానికి భయపడుతున్నారు. బాధితులకు న్యాయం జరగకపోవడం, కేసులు సంవత్సరాల తరబడి నడవడం వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుంది. తాజాగా మరో సంఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చోటు చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని మహిళ పై లైంగిక దాడి పాల్పడ్డారు దుండగులు. మియాపూర్ బొల్లారం x రోడ్ లో మహిళని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి సామూహిక ఆత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Delhi : గర్భిణీలకు గుడ్ న్యూస్.. రూ. 21,000ఇవ్వనున్న ప్రభుత్వం ?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!