Murder : మేడ్చల్‌లో వరుస హత్య కలకలం రేపుతున్నాయి. నిన్న మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య చోటు చేసుకుంది. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. అయితే.. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన గురించి మరిచిపోకముందే మరో దారుణం మేడ్చల్‌లో చోటు చేసుకుంది. మేడ్చల్‌లో 24 గంటలు గడవకముందే మరో హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వ్యక్తిని మెడపై కోసి హత్య చేశారు గుర్తు తెలియాలి వ్యక్తులు. పట్టణంలో నివాసం ఉండే వెంకట రమణ (32)ని అతని ఇంట్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ మృతదేహాన్ని పరిశీలించి క్లూ్స్ టీంకు సమాచారం అందించారు. దీంతో ఆధారాలు సేకరిస్తున్నారు క్లూస్ టీం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Harish Shankar: మీరు మంచి సినిమాలు చేస్తే ఎందుకు చూడరు హరీష్ శంకర్?