పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా హైదరాబాద్ మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్‌కుమార్ ప్రైవేటుసంస్థలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా…
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఓ మహిళ ఘనత వెలికితీశారు. ఈ ఘటన మార్చి 3న గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 216 జాతీయ రహదారిపక్కన జరిగింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. 26 మంది అమాయక జనాలు చనిపోడంతో సంతాపం ప్రకటిస్తు్న్నారు. పర్యటకులను కాల్చి చంపే ముందు.. ఉగ్రవాదులు వారి మతం గురించి అడిగారు. మానవాళికే సిగ్గుచేటు తెచ్చిన ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజాగా ఉత్తరాఖండ్ హరిద్వార్ నగరం భగత్ సింగ్ చౌక్ సమీపంలోని రోడ్లపై నిరసన…
ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు బంగారం కాజేస్తున్న కిలాడీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన కీలారు నాగ తేజగా గుర్తించారు. నిందితుడు నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన యువతని ఏకాంతంగా మాట్లాడాలని హోటల్‌కి తీసుకు వెళ్ళాడు.
విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. యోగేంద్ర బాబు మేనల్లుడు.. ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు…
విశాఖలో కలకలం రేపుతున్న స్కూల్ విద్యార్ధిని మృతి కేసు కలకలం రేపుతోంది. తల్లీ, అమ్మమ్మలపై అనుమానం వ్యక్తమవుతోంది.. జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిపై తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలిక తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకొచ్చారు. తండ్రికి తెలియకుండా చర్చికి తీసుకొచ్చారు. బాలిక…
భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది. పిడియాక్ట్రిషన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మియాపూర్ లోని ఓ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ అంశాన్ని మియాపూర్ పోలీసులు నెల రోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వద్దని హాస్పిటల్…
KPHB Mur*der: ఈ మధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల భర్తలను భార్యలు వివిధ రకాలుగా చంపేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో భర్తను చంపి పాతిపెట్టిన కేసులో పోలీసులు ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే కేసును చేదించారు. నిందితులు కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ…
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్ లో ఘటన జరిగింది. మహేష్ అనే వ్యక్తి శ్రీదేవిని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్, శ్రీదేవి దంపతుల మధ్య తరచూ గొడవలు చెలరేగాయి. మహేష్ నిన్న రాత్రి భార్య శ్రీదేవితోపాటు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.