CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
- ఇవాళ శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష..
- సమావేశానికి డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు హాజరు..
- క్షేత్రస్థాయి నివేదికలతో సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల అధికారులను ఈ సమీక్షకు భాగస్వాములను చేస్తున్నారు. డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు సుమారు 1,300 మంది అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరుకానుండగా.. జిల్లాల్లోని అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల నిర్వహణపై సీఎం వద్ద ఉన్న నివేదికలను అధికారుల ముందుంచి విశ్లేషించనున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు, పోలీసుల పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?