Murder Mystery : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు చివరికి ఈ కేసును చేధించారు. మే 23న ఓ యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన ఘోరమైన ఘటన వెనక నేపాల్‌కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. Joan Alexander: 88 ఏళ్ల…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
విష్ణు మంచు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “కన్నప్ప”కు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో మిస్సింగ్ అయినట్లు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, విచారణ కొనసాగుతోంది. ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమా యొక్క కీలక విఎఫ్ఎక్స్ కంటెంట్‌ను…
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Instagram Friendship: సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ ద్వారా మొదలైన పరిచయం ఇద్దరి జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు సురేశ్, విశాఖపట్నానికి చెందిన వివాహిత పద్మ మధ్య ఇంస్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి సంబంధం పెరిగి చివరకు.. పద్మ తన భర్త, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో గత 9 నెలలుగా సురేశ్‌తో కాపురం చేస్తోంది. అయితే, ఈ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నట్టు…
Nak*ed : మన సమాజంలో రోజు రోజుకీ ఏదో ఒక విచిత్ర ఘటన మన ముందుకు వస్తోంది. కొన్ని సంఘటనలు విని అవాక్కవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి ఒక ఆఘాతకరమైన, నమ్మశక్యంకాని ఘటన వెలుగులోకి వచ్చింది. “నా భర్త థర్డ్ జండర్‌గా వేషం వేసుకుని అశ్లీల వీడియోలు తీయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు” అంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంతో కబీర్‌నగర్ జిల్లాలో చోటు…
Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ…
Fraud : ప్రభుత్వ ఉద్యోగం అనే ఆశ చూపించి అమాయకులను మోసం చేస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా కోర్టు పరిధిలో వెలుగులోకి వచ్చింది. కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఒక మహిళ నుంచి రూ. 9 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రం ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. సిరికొండ మండలం చీమన్‌పల్లి గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ అనే వ్యక్తి పై తేజావత్ పిరూ అనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఉద్యోగం, పోస్టాఫీస్…