బెంగళూరులోని సంపిగేహళ్లి ప్రాంతంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిపై దాడి చేసి “జై శ్రీరామ్” అని నినాదం చేయమని బలవంతం చేశారని బాధితుడు చెప్పాడు. ఈ సంఘటన జూన్ 22న సాయంత్రం 4:30 – 5:30 గంటల మధ్య జరిగింది. బాధితుడి పేరు జమీర్. వృత్తిరీత్యా మెకానిక్. తన స్నేహితుడు వసీమ్‌తో కలిసి ఓ కస్టమర్ నుంచి డబ్బు వసూలు చేయడానికి బయటకు వెళ్లినట్లు సమాచారం. చొక్కన్‌హళ్లి సమీపంలోని చెట్ల గుత్తికి చేరుకోగానే.. 5 నుంచి 6 మంది గుర్తు తెలియని యువకులు జమీర్, వసీమ్‌లను దుర్భాషలాడి కొట్టడం ప్రారంభించారు. జమీర్ అక్కడి నుంచి ఎలాగో తప్పించుకోగలిగాడు. కానీ వసీంను కర్రలతో చితక బాదారు. అతను నొప్పితో అరుస్తూ అల్లాహ్ అని అరిచాడు. నిందితులు అల్లాహ్‌కి బదులుగా జై శ్రీరామ్ చెప్పమని బలవంతం చేశారని బాధిత యువకుడు ఆరోపించాడు.
READ MORE: Salman khan : స్టార్ హీరోయిన్ బాత్రూమ్ లో సల్మాన్ ఖాన్ పోస్టర్..
ఈ సంఘటన తర్వాత బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ 2023 (BNS) లోని సెక్షన్ 126(2), 115(2), 118(1), 299, 352, 351(2), 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అయితే.. బాధితుడి వాంగ్మూలాలలో కొన్ని తేడాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎందుకు ఇలా కొట్టారు? దాడి చేశారు? అనే అంశంపై బాధితుడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. అసలు ఏం జరిగిందో పూర్తిగా దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
READ MORE: Millionaires migration: వలస వెళ్తున్న “కుబేరులు”.. ఏ దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారంటే..