నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
Murder : ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణ హత్య ఒక గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28) గుర్తు తెలియని దుండగుల చేతిలో బలైపోయాడు. ఆదివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది. విజయ్ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడికి…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో 19 ఏళ్ల బాలికపై 23 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి, వారందరినీ రిమాండ్కు పంపారు. బుధవారం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విదుష్ సక్సేనా ఈ మేరకు సమాచారం అందించారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లాల్పూర్ పాండేపూర్ ప్రాంతంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు…
Fire Break : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కార్లు. రెండు ఆటోలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైన కార్లు ఆటో లు పోలీస్ స్టేషన్ వెనకాల ఖాళీ స్థలంలో ఉంచారు. ఖాళీ స్థలానికి ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ అవతలి భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు మంటను ఏర్పాటు చేశారు ఆ మంటలు చెలరేగి కార్లపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన…
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లిదండ్రులు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది.
బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది.
Shocking Incident : సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకూ, స్వార్థ ఆకాంక్షలకూ బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమిన్పూర్లో చోటుచేసుకుంది. రజిత (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర…
హైదరాబాద్లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు దాడి చేశారని వివరించారు.…
నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బంధువులతో కలిసి వచ్చిన యువతిపై గుట్టల ప్రాంతంలోకి లాక్కెళ్లి 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో, ఆమెతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా…