సౌత్ కోల్‌కతా లా కాలేజీ అత్యాచారం కేసులో కోల్‌కతా పోలీసులు శనివారం ఓ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది నాల్గవ అరెస్టు. గతంలో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ క్యాంపస్‌లో ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడి సూచనల మేరకు.. గార్డు విద్యార్థిని గదిలో ఒంటరిగా వదిలి బయటకు వెళ్లాడు. సహాయం కోసం బాధితురాలు పదే పదే వేడుకున్నప్పటికీ.. గార్డు ఆమెకు సహాయం చేయలేదని పోలీసులు తెలిపారు.
READ MORE: Dil raju Dreams : దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ పై.. అనిల్ రావిపూడి షాకింగ్ రియాక్షన్!
తాజాగా.. నిందితులైన ముగ్గురిలో ఒకరి తండ్రి తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ ఘటనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు ఒకవేళ తప్పు చేశాడని తేలితే కఠిన శిక్ష విధించాలని స్పష్టం చేశారు. “ముందుగా నేను భారత పౌరుడిని.. ఆ తరువాత ఓ తండ్రిని. ఈ ఘటనకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాకు కోర్టుపై పూర్తి నమ్మకం ఉంది.. ఇందులో నా కొడుకు పాత్ర ఉందని తేలితే.. అతనికి కఠినమైన శిక్ష పడాలి.” అని వెల్లడించారు. కోల్‌కతా పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని పునరుద్ఘాటించారు.
READ MORE: Dil raju Dreams : దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ పై.. అనిల్ రావిపూడి షాకింగ్ రియాక్షన్!
#WATCH | Kolkata, West Bengal | Father of one of the accused in the Kolkata alleged gangrape case, says, "First I am a citizen of India, then a father. The matter is sub-judice and the police are carrying out the investigation. We have trust in the court…Strict punishment… pic.twitter.com/IIbRzphofj
— ANI (@ANI) June 28, 2025