Karnataka: ట్రిపుల్ మర్డర్.. భర్తను హత్య చేసిన ముగ్గురిని ప్రతిజ్ఞ చేసి మరీ చంపిన భార్య..
- కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురి దారుణ హత్య
- తన భర్తను చంపిన వాళ్లను చంపిన భర్య
- మారణాయుధాలతో దాడి చేసిన నిందితులు
- ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
READ MORE: Air India plane crash: ఎయిరిండియా ప్రమాద బాధితుల కోసం రూ. 500 కోట్లతో టాటా ట్రస్ట్..!
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ఈ నేరానికి పాల్పడిన పట్టాన్ గ్రామ నివాసితులు నాగరాజ (23), ఇరన్న (27), భిర్ణ్య (21), సిద్ధినాద (22), నాగరాజ్ (17), పిరేష్ (35), సాగర్ (24), రచన్న్య అలియాస్ గిల్లి (22), చంద్రకాంత్ (30), భాగ్యశ్రీ (30) లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు హత్యకు గల కారణాలను వెల్లడించారు. వాస్తవానికి.. గత సంవత్సరం సోమనాథ్ తాలికోటి అనే యువకుడిని హత్య చేశారు. అప్పుడు సోమనాథ్ భార్య తన భర్త మృతదేహం ముందు హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు తన మంగళసూత్రాన్ని తీసివేయనని ప్రతిజ్ఞ చేసింది.
READ MORE: DRI: పాకిస్థాన్‌కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
గత ఏడాది నవంబర్ 12న నిందితుల్లో ఒకరైన భాగ్యశ్రీ భర్త సోమనాథ్ తాలికోటి హత్యకు గురయ్యాడు. తాజాగా హత్యకు గురైన సిద్ధారుధ, అతని కుటుంబ సభ్యులు సోమనాథ్‌ను దారుణంగా హత్య చేశారు. సోమనాథ్ హత్య అనంతరం అతని భార్య భాగ్యశ్రీ తన భర్త మృతదేహం ముందు ప్రమాణం చేసింది. తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీసివేయనని ఆమె ప్రతిజ్ఞ చేసింది. సోమనాథ్ సోదరుడు ఈరన్న ముందు భాగ్యశ్రీ ఈ ప్రమాణం చేసింది.
READ MORE: DRI: పాకిస్థాన్‌కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
సోమనాథ్ ను హత్య చేసిన నిందితులు సిద్ధారుధ, జగదీష్, అన్నప్ప ఇటీవల బెయిల్‌పై వచ్చారు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఈరన్న, నాగరాజు, భాగ్యశ్రీ ఎదురుచూస్తున్నారు.. జూన్ 24, మంగళవారం అర్ధరాత్రి సిద్ధారుధ, జగదీష్ ధాబాలో ఉన్నారని వీరికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సిద్ధారుధ, జగదీష్‌లను చంపారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు డబుల్ మర్డర్ అనుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ రక్తపు మరకలను అనుసరించి వెనుక ఉన్న పొలంలోకి పరిగెత్తింది. ధాబాలో పనిచేసే రామచంద్ర అనే మరో వ్యక్తిని పొలంలో హత్య చేసినట్లు తెలిసింది. అప్పుడు ఇది ట్రిపుల్ మర్డర్ అని వెలుగులోకి వచ్చింది.
విచారకరమైన విషయం ఏమిటంటే హంతకుల లక్ష్యం రామచంద్ర కాదు అన్నప్ప. అయితే, చీకటిలో అన్నప్ప, రామచంద్ర హంతకుల నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. హంతకులు వారిని వెంబడించారు. చీకటిలో హంతకులు రామచంద్రే అన్నప్ప అని భావించి చంపేశారు. ప్రస్తుతం, ఈ ట్రిపుల్ మర్డర్‌కు సంబంధించి పోలీసులు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!