దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్‌లో బాంబు ఉందని పోలీసులకు సమాచారం రావడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి మార్కెట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు, ఎన్ఎస్‌జీ అధికారులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు.
Read Also: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఘాజీపూర్ మార్కెట్ వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్‌జీ అధికారులు బ్యాగులోని బాంబును ప్రజలు సంచరించని ప్రదేశానికి తరలించి అక్కడ పేల్చివేశారు. సకాలంలో పోలీసులు బాంబును గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఈ బ్యాగ్‌ను ఎవరు పెట్టారన్న విషయంపై విచారణ చేపట్టారు.