ఏపీలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధించిన విల్లాల్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్… విలువైన వస్తువులు అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఈనెల 3న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా… మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని…
విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్‌లో రౌడీ షీటర్ దోమాన చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఇస్తూ చిన్నారావు వారికి ఆశ చూపించాడు. దీంతో కొందరు విద్యార్థినులు చిన్నారావు మాటలు నమ్మి అతడి దగ్గరకు వెళ్లారు. కానీ ఇదే అదనుగా భావించిన చిన్నారావు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానిక మహిళలందరూ కలిసి…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిపై యువతి లైంగిక దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించి రూ.16 లక్షల సొత్తును కాజేసింది. వివరాల్లోకి వెళ్తే… టోలిచౌకీలో నివాసం ఉంటున్న కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. అయితే ఇల్లు సద్దుతున్న క్రమంలో 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి 9వ తరగతి చదువుతున్న కుమారుడిని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బంగారం తీసింది తానేనని బాలుడు చెప్పడంతో తల్లి…
విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…
హైదరాబాద్ మియాపూర్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రహ్మానందం (22) మిస్సింగ్ మిస్టరీగా మారింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం బయటకు వెళ్లి తమ కుమారుడు తిరిగిరాలేదని తల్లిదండ్రులు నరసింహారావు, నాగలక్ష్మీ దంపతులు ఆరోపిస్తున్నారు. 2019 జూలై 3న ఆఫీసుకు వెళ్లి అదృశ్యమయ్యాడని… అప్పటి నుంచి ఇంటికి రాలేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులో మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయిందని… ఆ తర్వాత బ్రహ్మానందం ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని.. దీంతో పోలీసుల…
సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ పోలీస్ రాసలీలలు బహిర్గతం అయ్యాయి. వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ కొత్తపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మహిళ భర్తకు తెలిసిపోయింది. దీంతో ఎస్సై షఫీని, తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఓ ప్లాన్ వేశాడు. మహిళ భర్త ప్లాన్‌కు అతడి స్నేహితులు కూడా సహకరించారు.…
సాధారణంగా ఇంట్లో విలువైన వస్తువులు పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ కర్నూలు జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. తన పెన్సిల్ పోయిందంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో ఈ ఘటన జరిగింది. హన్మంతు అనే బాలుడు తన పెన్సిల్‌ను తోటి విద్యార్థులు దొంగతనం చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పెన్సిల్‌ను దొంగతనం చేసిన విద్యార్థిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. Read Also: ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా…
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఘరానా లూటీ జరిగింది. పట్టపగలే సినీఫక్కీలో ఓ కారు అద్దాలు పగులకొట్టి దొంగలు రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే… జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి, ఆయన కుమారుడు సాయి గణేష్… బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టారు. డ్రా చేసిన తర్వాత సంతకం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే… డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు…
సైబర్ నేరాలపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. ఎంత హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం మారడం లేదు. నిత్యం సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. దీంతో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీ పేరుతో నేరగాళ్లు రూ.33 లక్షలను దోచుకున్నారు. Read Also: దుమారం రేపుతున్న హీరోయిన్ ‘ఫస్ట్ నైట్’ కామెంట్స్ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్‌కు చెందిన…
హైదరాబాద్ దోమలగూడలో నవ వధువు భార్గవి మిస్సింగ్ మిస్టరీ వీడింది. భార్గవి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. దోమలగూడకు చెందిన భార్గవి ఈనెల 10న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబసభ్యులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. 200 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. Read Also:…