మగాళ్ళు మృగాళ్ళుగా మారుతున్నారు. చెన్నైలో రెండురోజుల క్రితం భార్య పిల్లల్ని రంపంతో కోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దారుణ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఘటన విభ్రాంతిని కలిగించింది. తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ఘాతుకం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను దారుణంగా కొట్టి చంపి చెరువులో పడేశాడు.
ఇదేం లేటెస్ట్ కాదు. ఈ ఘటన జరిగి చాలా కాలం అయింది. ఐదు నెలల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ మిస్టరీ. తిరుపతి కొర్లగుంటకు చెందిన పద్మను, వేణుగోపాల్ అనే సాఫ్ట్ వేర్ కు ఇచ్చి పెళ్ళి చేశారు కుటుంబ సభ్యులు. 2019లో పెళ్ళి అయింది. పెళ్ళి అయినా నాలుగు నెలల నుంచే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వేణుగోపాల్ పద్మను మానసికంగా కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. ఇంట్లో పెట్టి తాళం వేసి తన శైలి శాడిజాన్ని చూపించేవాడు భర్త వేణు.
భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులకు అప్లై చేసింది పద్మ. భార్య,భర్తల్ని కలపాలని పలుమార్లు కుటుంబసభ్యులు రాజీ కోసం ప్రయత్నించారు. రాజీ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. రాజీకి పద్మ కూడా ఒప్పుకోకపోవడంతో భార్యను కొట్టి చంపి భార్య మృతదేహాన్ని ఒక సూట్ కేస్ లో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ వెంకటాపురం చేపల చెరువులో వేశాడు వేణు గోపాల్. పైగా,తన భార్య తప్పిపోయిందని జనవరిలో కంప్లైంట్ ఇచ్చాడు. కుటుంబ సభ్యులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో భర్తపైన పోలీసులకు అనుమానం వచ్చింది. తమ దైన రీతిలో పోలీసులు ఎంక్వైరీ చేయగా ఋ ఘోరం బయటపడింది. వేణుగోపాల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. భర్త కిరాతకంతో తిరిగి రాని లోకాలకు చేరిన కూతురి కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
LIVE: కొండాపూర్ గాయత్రి కేసులో కీలక అంశాలు