Krishna District: కృష్ణా జిల్లా మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు గర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బందరు డీఎస్పీ భాషా, పెడన రూరల్ సీఐ వీరయ్య ప్రసన్నగౌడ్, గూడూరు ఎస్సై వెంకట్…
Twist in Missing Case: చిత్తూరు జిల్లా తెలుగు గంగ కాలువలో యువతి మృతదేహం లభ్యం ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయిందని భావించిన యువతి వీడియోలో ప్రత్యక్షమైంది. హత్య చేశాడని అనుమానించిన యువకుడితోనే వీడియోలో యువతి కనిపించింది. శ్రీకాళహస్తిలోని రామాపురం గ్రామానికి చెందిన చంద్రిత అనే యువతి ఈ ఏడాది జనవరి నుంచి మిస్సింగ్ అయ్యింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ చంద్రశేఖర్‌తో యువతి చంద్రిత…
SI Suicide: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మౌలాలిలో రైల్వేట్రాక్‌పై రమణ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడుస్తూ వెళ్లిన స్థానికులు చెల్లాచెదురుగా పడి ఉన్న ట్రాఫిక్ ఎస్సై రమణ శరీరభాగాలను చూసి ఉలిక్కిపడ్డారు. వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి మృతుడు ట్రాఫిక్…
Kidnap Woman: గుంటూరులో వరుసగా కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌ల వ్యవహారంలో నాగమ్మ అనే ఓ మహిళ కీలక సూత్రధారిగా ఉందన్నారు. కిడ్నాప్ వ్యవహారం తెలియగానే సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశామని.. పిల్లల్ని డబ్బు కోసమే నాగమ్మ గుంటూరు నుంచి తీసుకువెళ్లి జంగారెడ్డిగూడెంలో అమ్మేసిందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులో ఇటీవల జరిగిన బాలుడు కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ హాస్పిటల్‌లో పిల్లలకు భద్రత…
Missing Case: కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 7వ తరగతి విద్యార్థిని అదృశ్యం అయ్యింది. మూడు రోజులు గడచినా విద్యార్థిని ఆచూకీ తెలికపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బద్వేల్ మండలం ఉప్పత్తివారిపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లె చిన్న వెంకట సుబ్బారెడ్డి రవణమ్మ కుమార్తె వెంకట సంజన బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూలులో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం స్కూలు నుంచి బయటకు వచ్చిన వెంకట సంజన తిరిగి స్కూల్‌కు వెళ్ళక పోవడంతో…
Hindupuram YSRCP Leader Killed: హిందూపురం నియోజకవర్గంలో శనివారం రాత్రి దారుణహత్య చోటు చేసుకుంది. వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి (46) గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబా మూసేసి కారులో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట…
Terrorist Attacks Plan in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర కేసులో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సిటీలో పేలుళ్లకు కుట్ర పనిన్న కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అబ్దుల్ జాహిద్‌తో పాటు సమీవుద్దీన్, మాజా హాసన్ అరెస్ట్ అయ్యారు. మొత్తం ఆరుచోట్ల పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్లతో బాంబు దాడులకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఆరు ప్రాంతాలను జాహిద్ గ్యాంగ్…
Kidnap Mistery: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రాజీవ్ సాయి (8) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు…