సైబర్ నేరాలపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. ఎంత హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం మారడం లేదు. నిత్యం సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. దీంతో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీ పేరుతో నేరగాళ్లు రూ.33 లక్షలను దోచుకున్నారు.
Read Also: దుమారం రేపుతున్న హీరోయిన్ ‘ఫస్ట్ నైట్’ కామెంట్స్
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి క్రిప్టో కరెన్సీ తరహా కాయిన్ తయారుచేశానని పలువురిని నమ్మించాడు. తాను క్రియేట్ చేసిన క్రిప్టో కరెన్సీ కాయిన్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రమోట్ చేస్తానని.. దీంతో ఆ కాయిన్‌కు డిమాండ్ ఏర్పడుతుందని తన స్నేహితులతో కలిసి ప్రచారం చేయించాడు. వారి మాటలను అమాయక ప్రజలు నమ్మేశారు. 70 డాలర్లు అని చెప్పి 70 బినాకిల్ కాయిన్స్ రూపంలో సైబర్ చీటర్లు రూ.33 లక్షలు కాజేశారు. ఈ తతంగంపై ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.