పోలవరం నాకొక సెంటిమెంట్.. ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధ పడేది నేనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు.
పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. ఇక, గత కొన్నేళ్లగా ఎదురైన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోలవరం నిర్వాసితులు వివరించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ రోజు (మార్చ్ 27) ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరానికి వెళ్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గతంలో చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశాడు. జగన్ నిర్వాహకం వల్ల కొత్తగా రూ. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోంది. గత ఐదేళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా రూ. 50 వేల కోట్లు నష్టపోయాం.. కూటమి ప్రభుత్వం…
Nimmala Rama Naidu: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్ కు నేటికి రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా రావడం జరిగింది అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కీలక సమీక్ష నిర్వహించనుంది.. పోలరవం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్ కాంక్రీట్ టీ -16 మిశ్రమాన్ని కాంట్రాక్టు సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటించింది.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాల్లో వరద పరిస్థితి గురించి స్థానికులను అడిగి తెలుసుకుంది సెంట్రల్ టీమ్.. వరద ముంపును అంచనా వేసేందుకు వచ్చిన బృందం వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో…