CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ రోజు (మార్చ్ 27) ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరానికి వెళ్తున్నారు. పునరావాసం, పరిహారం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు సహా పలు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించి.. కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 10 గంటల 55 నిమిషాలకు పోలవరం వ్యూ పాయింట్ కు వెళ్లనున్నారు.. మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశీలన చేయనున్నారు. అనంతరం అధికారులతో ప్రాజెక్ట్ పనులపై సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తోంది. ఇక, సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రస్తుత పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేయనున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వడం ద్వారా ఏపీలో సాగు నీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకు తాగు నీరు కూడా అందుబాటులోకి వస్తుంది.