కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Harish Rao: పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొండమదులు పంచాయతీలోని గ్రామాలలోని పోలవరం నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండోవ రోజు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో 2017 సంవత్సరంలో కుదుర్చుకొన్న ఎంఓయు ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: AP Cabinet: కేబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. అయితే, ఇదే సమయంలో.. పోలవరాన్ని భారీ టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 15 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటుపై దృష్టి సారించారు అధికారులు.. 255 కోట్ల రూపాయలతో రిసార్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది..
MLC Kavitha : పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భద్రాచలం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ముంపు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు తమకు ఎదురవుతున్న విద్య, వైద్యం, రవాణా వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే తెలంగాణ జాగృతి…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం…
ఏలూరు: నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉదయం 9 గంటలకు డయాఫ్రంవాల్ నిర్మాణ పనుల పరిశీలన. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, ఏజేన్సీలతో మంత్రి సమీక్ష. నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్. నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు.…
Bharat Ram: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు గతంలో చేసిన తప్పిదాలు క్షమించరానివని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు తప్పులు చేయుటం వల్లే డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు అదే తప్పులు పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు. ప్యానల్ ఆఫ్…
పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని.. తుపాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నామని మంత్రి రామానాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని.. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు.