ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటించింది.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాల్లో వరద పరిస్థితి గురించి స్థానికులను అడిగి తెలుసుకుంది సెంట్రల్ టీమ్.. వరద ముంపును అంచనా వేసేందుకు వచ్చిన బృందం వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో…
Nimmala Ramanaidu: గత విధ్వంస పాలనకు నిదర్శనం ఇరిగేషన్ ప్రాజెక్టులే అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 17 నెలల పాటు పోలవరం ఆలన పాలన లేకుండా చేశారు.. పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచీ నాలుగు వేల క్యూసెక్కులు అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని సీఎం అన్నారు..
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు.
పోలవరం నిర్మాణ పనుల్లో కీలక ఘట్టానికి ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ డివాల్ నిర్మాణ పనులను చేపడుతోంది. పాత డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. ఈ డయాఫ్రం వాల్ కోసం…
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతాం. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ కు పూర్తి చేసేలా పని చేస్తున్నాం అన్నారు మంత్రి నిమ్మల.. 2017లో నిర్వాసితులకు రూ 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే.. మరలా ఇప్పుడు మరో రూ 800 కోట్లకు పైగా నిధులను అందించారని తెలిపారు..
పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదు.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని దుయ్యబట్టిన ఆయన.. 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు.. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో విడుదల చేశాం అన్నారు.
Nimmala Rama Naidu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని 6 గ్రామాలలో రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు రూ. 6 కోట్ల 86 లక్షల నిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లు మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం విడుదల చేసిన 832 కోట్ల రూపాయల నిధులు, దళారీ…
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి అధికారులు ఇచ్చిన యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇందులో ప్రధానంగా పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడంపై లక్ష్యాలు నిర్దేశించారు.. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్ -1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ -2తో పాటు మిగతాపనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ.. జులై నాటికే వాటిని పూర్తి చేయాలని లక్ష్యాన్ని…
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. పోలవరం పర్యటన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు.. అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని.. కానీ, పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారు.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని, బతిమిలాడి మేం కడతామని చెప్పి తీసుకున్నారు... ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ…