పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తోంది.. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. పూర్తి చేసిన పనులను పరిశీలించి.. ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను నుంచి సమాచారం తీసుకుని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇక, మరోసారి పోలరవం ప్రాజెక్టు డ్యామ్ సైట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్.. ఈ నెల14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు పోలవరం ప్రాజెక్టుకు…
ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగినమేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతకమవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం ఒకటైతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులిపేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాసపనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా…
తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాగునీరు చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగా దేవీపట్నం నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. పోలవరంలో ముంపునకు గురవుతున్న పలు గ్రామాల ప్రజలు తమ సామగ్రిని తరలించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పోలవరం ప్రాజెక్టులో నేడు ఓ మైలురాయిగా మిగిలిపోనుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి నేడు దిగువకు గోదావరి నీటి విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి అయ్యింది. స్పిల్ వే మీదుగా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. కాఫర్ డ్యాం బ్యాక్ వాటర్ తో ముంపు గ్రామాలకు వరద భయం ఉంది. దాంతో ముంపు గ్రామాల నిర్వాసితులు గ్రామాలు ఖాళీచేస్తున్నారు. ఈరోజు అప్రోచ్…