భారత టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ... దీంతో పాటు 5జీ సేవలకు కూడా శ్రీకారం చుట్టారు.
సాంకేతికతలో కొత్త శకాన్ని తీసుకురావడంతో పాటు ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు అనేక రెట్ల వేగంతో అత్యంత విశ్వసనీయ కమ్యూనికేషన్ వ్యవస్థను అందించడానికి ప్రయత్నిస్తున్న 5G టెలికాం సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు.
గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
భారత్లోని అన్ని ప్రాంతాల క్రీడాకారులు పోటీపడే సమయం ఆసన్నమైంది. దేశంలోని అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరం నేటి నుంచి జరగనుంది. గుజరాత్లో గురువారం 36వ జాతీయ క్రీడలను నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
DA hiked by 4% for central govt employees, pensioners: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం. డియర్నెస్ అలవెన్స్(డీఏ)ను 4 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దసరా ముందు కేంద్ర డీఏ పెంచడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల దేశంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
Shaheed Bhagat Singh International Airport: గత ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చండీగఢ్ విమానాశ్రయం పేరును షహీద్ భగత సింగ్ గా మారుస్తామని ప్రకటించారు. బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును షహీద్ భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.