భారత్‌లోని అన్ని ప్రాంతాల క్రీడాకారులు పోటీపడే సమయం ఆసన్నమైంది. దేశంలోని అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరం నేటి నుంచి జరగనుంది. గుజరాత్‌లో గురువారం 36వ జాతీయ క్రీడలను నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
DA hiked by 4% for central govt employees, pensioners: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం. డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను 4 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దసరా ముందు కేంద్ర డీఏ పెంచడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల దేశంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
Shaheed Bhagat Singh International Airport: గత ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చండీగఢ్ విమానాశ్రయం పేరును షహీద్ భగత సింగ్ గా మారుస్తామని ప్రకటించారు. బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును షహీద్ భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Centre To Extend Free Ration Scheme By Three More Months: కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పేదలకు అందించే ఉచిత రేషన్ పథకాన్ని పొడగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని అందించేందకు కేంద్ర కసరత్తు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో ఈ పథకం కింద పేదలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత ఆహార…
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు.
Chandigarh Airport To Be Renamed After Bhagat Singh: చండీగఢ్ విమానాశ్రయానికి పేరు మార్పు గురించి హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతుల నేపథ్యంలో విమానాశ్రయం పేరును ‘‘ భగత్ సింగ్’’గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రకటించారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా.. చండీగఢ్ విమానాశ్రయం పేరును ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ గా మార్చుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా నివేదికలు తెలిపాయి.
భారతదేశంలో మొబైల్ నెట్ వర్క్ లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 5 జీ ప్రారంభానికి డేట్ పిక్స్ అయింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో 5 జీ సేవలు ప్రారంభించనున్నారు.