Pakistan's Ruling Party Leader Threatens India With "Nuclear War": దాయాది దేశం పాకిస్తాన్ భారతదేశాన్ని అణు యుద్ధం పేరుతో బెదిరిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు ఇలాగే అక్కడి రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా మరోసారి పాకిస్తాన్ అధికార పార్టీ నాయకురాలు భారత్ కు అణు బెదిరింపులు చేసింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత షాజియా మర్రీ ఈ బెదిరింపులకు పాల్పడింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత ప్రధాని నరేంద్రమోదీపై చేసిన…
Defense Minister Rajnath Singh's strong reply to China: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు స్ట్రాంగ్ రిప్లై పంపాడు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద చైనా, ఇండియా బలగాల మధ్య ఘర్షణ గురించి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. భారతదేశం సూపర్ పవర్ గా ఎదగాలనుకుంటుంది కేవలం ప్రపంచ క్షేమం కోసమే అని.. ఇతరుల భూభాగాలను ఆక్రమించుకునేందుకు కాదని డ్రాగన్ కంట్రీ చైనాను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.…
Sufi Council Slams Bilawal Bhutto Remarks On PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు భారతదేశంతో ఆగ్రహజ్వాలలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతోంది. ఢిల్లీలోని పాక్ ఎంబసీ ముందు బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉంటే బిలావల్ భుట్టోపై ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ నసీరుద్దీన్ చిస్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
Pakistan Foreign Minister's Controversial Comments on Prime Minister Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎన్ భద్రతా మండలిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని తూర్పారపట్టారు. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని.. ఇటువంటి దేశం ఉగ్రవాదంపై నీతులు చెబుతుందని విమర్శించారు.
PM Modi, Russian President Vladimir Putin speak on phone: భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి.
No.of Airports in India After Modi: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. దేశంలో ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య దాదాపు రెట్టింపయింది. ఆయన తొలిసారి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 140కి పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య ట్రిపుల్ కానుందని.. అంటే.. 220కి చేరనుందని అధికారులు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు గోవాలో మోపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.