Bilawal Bhutto Zardari: “బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ..” ప్రధాని మోదీపై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Foreign Minister’s Controversial Comments on Prime Minister Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎన్ భద్రతా మండలిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని తూర్పారపట్టారు. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని.. ఇటువంటి దేశం ఉగ్రవాదంపై నీతులు చెబుతుందని విమర్శించారు.
ఇదిలా ఉంటే జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు, అయితే గుజరాత్‌లోని కసాయి బ్రతికున్నాడని, అతను భారత ప్రధాని అని నేను భారతదేశానికి చెప్పాలనుకుంటున్నాను’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యేంత వరకు అమెరికా ఈ దేశంలోకి రాకుండా నిషేధించిందని.. ఆర్ఎస్ఎస్ ప్రధాని, ఆర్ఎస్ఎస్ విదేశాంగ మంత్రి అంటూ మోదీ, జైశంకర్ లను విమర్శించాడు. ఆర్ఎస్ఎస్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
Read Also: Crime News: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో దారుణం.. చివరికి
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మరోసారి అధమ స్థితికి చేరుకుందని.. అనాగరిక ప్రేలాపన చేస్తోందని విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 1971లో బంగ్లాదేశ్ లోని బెంగాలీలు, హిందువులపై జరిగిన మారణహోమాన్ని పాకిస్తాన్ మరిచిపోయిందని, పాక్ పాలకులు సాగించిన మారణ హోమం కనిపించడం లేదని మైనారిటీల పట్ల పాక్ తీరు మారడం లేదని విమర్శలు గుప్పించారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ. ముంబై, న్యూయార్క్, లండన్, పఠాన్ కోట్, పుల్వామా దాడులు అన్నీ పాకిస్తాన్ కేంద్రంగానే జరిగాయాని అన్నారు. ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడని కీర్తిస్తూ, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్ , దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశం పాకిస్థాన్ అని కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖీ విమర్శించారు. బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ ముందు ఆందోళన నిర్వహించారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!