Defense Minister Rajnath Singh’s strong reply to China: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు స్ట్రాంగ్ రిప్లై పంపాడు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద చైనా, ఇండియా బలగాల మధ్య ఘర్షణ గురించి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. భారతదేశం సూపర్ పవర్ గా ఎదగాలనుకుంటుంది కేవలం ప్రపంచ క్షేమం కోసమే అని.. ఇతరుల భూభాగాలను ఆక్రమించుకునేందుకు కాదని డ్రాగన్ కంట్రీ చైనాను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ(FICCI) 95వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశం సూపర్ పవర్ అయ్యేందుకు అవసరం అయిన 5 అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారని ఆయన అన్నారు. తాము ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు శక్తివంతమైన దేశంగా మారాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు.
Read Also: Aquarium explodes : పేలిపోయిన ప్రపంచంలోని అతిపెద్ద అక్వేరియం
గాల్వాన్ కానీ తవాంగ్ కానీ సందర్భం ఏదైనా భారత రక్షణ బలగాలు అద్భుతమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు. విపత్కర పరిస్థితుల్లో వారి ధైర్యసాహసాలను ఎంత పొగిడినా తక్కువే అని .. ప్రధాని మోదీ హాయాంతో ప్రపంచవ్యాప్తంగా భారత గౌరవం మరింతగా పెరిగిందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. సరిహద్దు ఘర్షణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు రాజ్ నాథ్ సింగ్. ప్రతిపక్షాల ఉద్ధేశం ఏమిటో మేం ఎప్పుడు ప్రశ్నించలేదని.. వారి విధానాలపైనే చర్చ జరిపాం అని, పార్టీ విధానాలు నిజాలపై ఆధారపడి ఉండాలని.. కేవలం అబద్ధాలపై రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.