Pakistan’s Ruling Party Leader Threatens India With “Nuclear War”: దాయాది దేశం పాకిస్తాన్ భారతదేశాన్ని అణు యుద్ధం పేరుతో బెదిరిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు ఇలాగే అక్కడి రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా మరోసారి పాకిస్తాన్ అధికార పార్టీ నాయకురాలు భారత్ కు అణు బెదిరింపులు చేసింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత షాజియా మర్రీ ఈ బెదిరింపులకు పాల్పడింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించిన తర్వాత షాజియా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని భారత్ మరిచిపోకూడదు. మన అణు హెదా మౌనంగా ఉండేందుకు కాదు. అవసరం అయితే మేం వెనక్కి తగ్గబోం’’ అంటూ బిలావల్ భుట్టోకు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భుట్టో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ మరింత దిగజారిందని భారత విదేశాంగ శాఖ బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు నిన్న దేశవ్యాప్తంగా నిరసన తెలిపారు.
Read Also: Zelensky: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడి శాంతి సందేశం.. “నో” చెప్పిన ఫిఫా
ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్రస్థాయిలో పాకిస్తాన్ ను తప్పపట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? అని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో స్పందిస్తూ.. బిన్ లాడెన్ అయితే మరణించాడు కానీ.. గుజరాత్ కసాయి బతికే ఉన్నాడు అని భారత ప్రధాని గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగానే స్పందించింది. పాకిస్తాన్ 1971లో బెంగాల్ లో సాగించిన మారణహోమాన్ని మరిచిపోయిందంటూ.. మైనారిటీలను తీవ్రస్థాయిలో పాక్ పాలకులు హతమార్చారు అంటూ వ్యాఖ్యానించిండి భారత్. న్యూయార్క్, ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్, లండన్ నగరాల్లో దాడులకు పాకిస్తాన్ దేశమే స్పాన్సర్ చేసిందని భారత్ విమర్శించింది. ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడని కీర్తిస్తూ, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశం పాకిస్థాన్ అని భారత్ పేర్కొంది.