PM Modi: మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. గోవాలోని రెండవ అంతర్జాతీయ విమానాశ్రయమైన మోపా విమానాశ్రయం రూ. 2,870 కోట్ల పెట్టుబడితో పూర్తయింది.
గుజరాత్ శాసన సభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
గుజరాత్లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 182 స్థానాల్లో 156 స్థానాలను కైవసం చేసుకుంది.