క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక దినం మన సమాజంలో సామరస్యం, ఆనంద స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ద్వారా దేశంలో తొలిసారిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే విద్యా వ్యవస్థను రూపొందించడం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Prime Minister Narendra Modi's high-level meeting on Covid: కోవిడ్-19 మహమ్మారిపై ప్రధాని నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనావ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 విజృంభిస్తుండటంతో ఇండియా కూడా అప్రమత్తం అయింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నిపుణులతో, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ కోవిడ్ పరిణామాలపై అత్యున్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
No Decision Yet To Stop Flights From China, Says Centre: కరోనా మహమ్మారికి జన్మస్థలం అయిన చైనా ఎప్పుడూ లేని విధంగా మహమ్మారి బారినపడి అల్లాడుతోంది. గతంలో రోజుల వ్యవధిలో అక్కడ వేల కేసులు నమోదు అయితే.. ప్రస్తుతం గంటల్లోనే వేల కేసులు నమోదు అవుతున్నాయి. చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగింది. శ్మశాన వాటికల్లో పనిచేసేందుకు సిబ్బంది కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ‘జీరో కోవిడ్’ విధానాన్ని చైనా ఎత్తేయడంతో అక్కడ కేసుల సంఖ్య…
Amruta Fadnavis termed Prime Minister Narendra Modi as Father of Nation: భారతదేశానికి ఇద్దరు ‘జాతిపిత’ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. ప్రధాని నరేంద్రమోదీని ‘ఫాదర్ ఆఫ్ నేషన్’గా అభివర్ణించారు. ఈ వారం నాగ్‌పూర్‌లో రచయితల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మహాత్మాగాంధీ ఏమవుతారని ప్రశ్నించగా.. మహాత్మాగాంధీ ‘జాతిపిత’ అని.. ప్రధాని నరేంద్ర…
అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం(మిల్లెట్ ఇయర్) 2023ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఏర్పాటు చేసిన లంచ్‌లో తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆనందించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్…
మేఘాలయలోని షిల్లాంగ్ జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఎనిమిదేళ్ల ఈశాన్య భారత్‌లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు తమ ప్రభుత్వం రెడ్ కార్డ్ ఇచ్చిందన్నారు.
PM To Visit Poll-Bound Tripura, Meghalaya Today: త్వరలో ఎన్నికలు జరగబోయే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ. 6,800 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. హౌసింగ్, రోడ్లు, వ్యవసాయం, టెలికాం, ఐటీ, టూరిజం రంగాల్లో అనేక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని, షిల్లాంగ్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.