ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం.
కేంద్రం చొరవతో అట్టడుగు స్థాయి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొంటూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి, దేశ ప్రజలకు పోటీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023 ప్రదర్శనను బెంగళూరు శివారులోని యలహంకలో ప్రారంభమైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించారు.
Delhi-Mumbai Expressway: భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేను ప్రాజెక్టును మొదలుపెట్టింది. 1,386 కిలోమీటర్లు పొడవైన ఈ రహదారి ఆర్థిక రాజధాని ముంబైని దేశరాజధాని ఢిల్లీని కలుపుతుంది. ఇది పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మరింతగా తగ్గతుంది. 180 కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు ఇప్పుడున్న 24…
దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండో బ్యాచ్ ఫిబ్రవరి 18న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కి చేరుకుంటుందని సీనియర్ అటవీ అధికారి శనివారం తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈశాన్య రాష్ట్రం దక్షిణాసియాకు 'గేట్‌వే'గా మారడానికి సిద్ధంగా ఉందని ప్రధాని శనివారం అన్నారు.