IT raids on BBC office: బిగ్ బ్రేకింగ్.. బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT raids on BBC office in Delhi: ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం. లండన్‌కు చెందిన కంపెనీపై కార్యాలయం ఎందుకు దాడి చేసిందో స్పష్టంగా తెలియలేదు. కొన్ని నివేదికలు శాఖ కార్యాలయాన్ని కూడా సీల్ చేయవచ్చని సూచిస్తున్నాయి. 60 నుంచి 70 మంది సభ్యుల బృందం బీబీసీ కార్యాలయానికి చేరుకుని సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగులందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అంతేకాకుండా కార్యాలయంలోకి ఇతరుల ప్రవేశం, నిష్క్రమణ కూడా నిషేధించబడింది.
బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇండియాతో పాటు బ్రిటన్‌లో కూడా వివాదాస్పదం అయింది ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీతో తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ భారత ప్రధానిపై విమర్శలు చేస్తే, పలువురు ఎంపీలు మోదీకి మద్దతుగా నిలిచారు.
Also Read
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
Komatireddy Venkat Reddy: పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందే..!
ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంట్ నేపథ్యంలో బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని తిరస్కరించింది. దీన్ని తప్పుడు భావనగా పేర్కొంది. ఒక డాక్యుమెంటరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్.. బీబీసీ ఉద్దేశపూర్వకంగా భారత ప్రతిష్టను కించపరుస్తుందని వాదించారు. ఈ డాక్యుమెంటరీ వెనక కుట్ర దాగి ఉందని ఎన్ఐఏతో విచారణ దర్యాప్తు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా.. బీబీసీ ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు బీబీసీ ఐటీ దాడులు చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీపై డాక్యుమెంటరీ నేపథ్యంలోనే ఐటీ దాడులకు కేంద్రం ఉసిగొల్పినట్లు ఆరోపించింది. మొదట వారు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించారని, ఇప్పుడు ఐటీ దాడులను ప్రేరేపించారని, ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి అంటూ కాంగ్రెస్ మండిపడింది.
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!