Amit Shah: శివసేన పార్టీ, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా స్పందించింది. మోదీకి మహారాష్ట్రలో ముఖం చెల్లకే బాలా సాహెబ్ ఠాక్రే ముఖాన్ని వాడుకునేందుకు పార్టీ పేరు, ఎన్నికల చిహ్నాన్ని దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండేను దొంగగా అభివర్ణించారు.
బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సర్వే గురువారం వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎంపిక చేసిన బీబీసీ సిబ్బంది నుంచి ఆర్థిక డేటాను సేకరించారు.
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం.
కేంద్రం చొరవతో అట్టడుగు స్థాయి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొంటూ, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి, దేశ ప్రజలకు పోటీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.