Joe Biden Hails Air India Boeing Agreement: అమెరికాకు చెందిన బోయింగ్ సంస్త నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే! ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. దీనిని ఓ చారిత్రక ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. 220 బోయింగ్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందంతో అమెరికాలోని 44 రాష్ట్రాల్లో స్థానిక యువత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జో బైడెన్ వెల్లడించారు. అంతేకాదు.. ఇందులో చాలామందికి నాలుగేళ్ల డిగ్రీ కూడా అవసరం ఉండదని తెలిపారు. ఈ ఒప్పందం.. అమెరికా-భారత్ మధ్య ఉన్న బలమైన వాణిజ్య బంధాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రజలకు సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి.. ప్రధాని మోడీతో కలిసి భారత్‌తో మరింత దృఢమైన బంధాన్ని అమెరికా కోరుకుంటోందని జో బైడెన్ వెల్లడించారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది
ఇదిలావుండగా.. ఎయిరిండియా – బోయింగ్ డీల్ విలువ 34 బిలియన్ డాలర్లుగా తేలింది. ఈ ఒప్పందంలో మరో 70 (50 బీ737 మ్యాక్స్, 20 బీ787) విమానాల కొనుగోలు కూడా అవకాశం ఉంది కాబట్టి.. అప్పుడు మొత్తం లావాదేవీ విలువ 45.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. డాలర్ల విలువలో బోయింగ్‌కు ఇది మూడో అతిపెద్ద విక్రయం కాగా, విమానాల సంఖ్య పరంగా రెండోది. ఈ ఒప్పందం ప్రకారం బోయింగ్ నుంచి ఎయిరిండియా 190 బీ737 మ్యాక్స్, 20 బీ787, 10 బీ777ఎక్స్ విమానాల్ని కొనుగోలు చేస్తుంది. అంతకుముందు.. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 40 వైడ్ బాడీ విమానాలు సహా మొత్తం 250 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఆర్డర్ పెట్టింది. ఈ ఒప్పందానికి సంబంధించి వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, రతన్ టాటా, చంద్రశేఖరన్, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్‌బస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Health Tips: చద్దన్నం అంటే వ్యాక్ అంటున్నారా.. తింటే మీరే అవాక్కవుతారు