Aero Show: ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శనను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aero Show In Bengaluru: ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023 ప్రదర్శనను బెంగళూరు శివారులోని యలహంకలో ప్రారంభమైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఏరో ఇండియా-2023లో ఎయిర్ షోలు, ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకోనుంది. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహించనున్న ప్రదర్శనను ప్రధాని మోదీ ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రధాని ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ ఈవెంట్ 14వ ఎడిషన్ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి స్వదేశీ పరికరాలను, సాంకేతికతలను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తున్నారు. ‘భారత్‌లో తయారీ- ప్రపంచ కోసం తయారీ’ అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ప్రముఖ యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ ఫైటర్ జెట్ ప్రదర్శనలో పాల్గొంది. ఎఫ్/ఏ-18ఈ, ఎఫ్/ఏ-18ఎఫ్ సూపర్ హార్నెట్, యూఎస్ నేవీకి చెందిన అత్యంత అధునాతన ఫ్రంట్‌లైన్ క్యారియర్-ఆధారిత, మల్టీరోల్ స్ట్రైక్ ఫైటర్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఇవి స్టాటిక్ డిస్‌ప్లేలో ఉంటాయి. 98 దేశాలకు చెందిన దాదాపు 809 కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. వివిధ భారతీయ మరియు విదేశీ రక్షణ సంస్థల మధ్య రూ.75,000 కోట్ల పెట్టుబడుల అంచనాతో 251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో.. భారీ ప్రదర్శనకారుల విభాగంలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. వీటిల్లో ఎయిర్‌బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయీస్, ఎల్‌అండ్‌టీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ వంటి సంస్థలున్నాయి.
Prime Minister Narendra Modi releases commemorative stamps at #AeroIndia2023 in Bengaluru, Karnataka. pic.twitter.com/zpRDKlucnh
— ANI (@ANI) February 13, 2023
#WATCH | Light Combat Helicopter 'Prachand' performs aerobatic display at #AeroIndia in Bengaluru, Karnataka. pic.twitter.com/SxCFIDSrQD
— ANI (@ANI) February 13, 2023
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!