Aero Show In Bengaluru: ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు శివారు యలహంకలో నేడు ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఏరో ఇండియా-2023లో ఎయిర్ షోలు, ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకోనుంది. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహించనున్న ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రధాని ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ ఈవెంట్ 14వ ఎడిషన్ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి స్వదేశీ పరికరాలను, సాంకేతికతలను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. ‘భారత్‌లో తయారీ- ప్రపంచ కోసం తయారీ’ అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొంటున్నారు.
Triple Talaq: భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి యూకేకు పయనం.. ఎయిర్‌పోర్టులో భర్త అరెస్ట్
యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ప్రముఖ యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ ఫైటర్ జెట్ ప్రదర్శనలో పాల్గొననుంది. ఎఫ్/ఏ-18ఈ, ఎఫ్/ఏ-18ఎఫ్ సూపర్ హార్నెట్, యూఎస్ నేవీకి చెందిన అత్యంత అధునాతన ఫ్రంట్‌లైన్ క్యారియర్-ఆధారిత, మల్టీరోల్ స్ట్రైక్ ఫైటర్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఇవి స్టాటిక్ డిస్‌ప్లేలో ఉంటాయి. 98 దేశాలకు చెందిన దాదాపు 809 కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. వివిధ భారతీయ మరియు విదేశీ రక్షణ సంస్థల మధ్య రూ.75,000 కోట్ల పెట్టుబడుల అంచనాతో 251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.