Bhatti Vikramarka Counters On PM Narendra Modi: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధానికి శాస్త్రీయ దృక్పదం లేదని.. కరోన వస్తే చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బహుళ జాతి సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థికంగా ఉన్నవారు, ఆర్థికంగా లేనివారుగా దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ ఆలోచన కలిగిన నాయకత్వం ఈ దేశానికి అవసరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ఏమైందని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణకి కృష్ణా నదిలో నీటి వాటా ఎందుకు జరగడం లేదు? దశాబ్ద కాలం అవుతున్నా ఎందుకిలా జరుగుతుంది? దీనిపై పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా పెద్దదని, ఇప్పటివరకూ మొత్తం 9 బడ్జెట్‌లు ప్రవేశ పెట్టారని అన్నారు.
CM KCR: ప్రతి డివిజన్‌లో ఆధునిక మార్కెట్లు.. కల్తీ బెడద లేకుండా చేస్తాం
నిధులు, నీళ్లు, నియమకాల కోసం ఉద్యమం జరిగిందని.. తెలంగాణ ఉద్యమంతో పాటు నక్సల్ బరి ఉద్యమం కూడా జరిగిందని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. అయితే.. ఎన్ని ఉద్యమాలు చేసినా ఫెయిల్ అవ్వడంతో, సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రమే దిక్కు అని నిర్ణయానికి వచ్చారని అన్నారు. పోరాటంలో అందరూ కలిసి పని చేశారని.. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా సహకరించారని అన్నారు. రాష్ట్రం ఏర్పడాలి, ఆకాంక్షలు నెరవేరాలి అనేదే అందరి లక్ష్యం, ఉద్దేశమన్నారు. ఇప్పుడు నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. విద్యకు కేటాయింపులు పెంచాలని, పొడుభూముల పంపకం తేదీ త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ నిధులుపై ఫ్రీజింగ్ పెడుతున్నారని, అలా చేయొద్దని కోరారు. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగారు.
Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….
పత్తి కొనుగోలుకు కేంద్రం తక్కువ నిధులు ఇచ్చిందని.. సీసీఎల్ఏ కొనకపోతే రాష్ట్రం పత్తి రైతులను ఆదుకోవడానికి చర్యలు పూనుకోవాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదలకు 100 గజాల స్థలంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. వీఆర్ఏల జీతాలు, సర్పంచులు నిధులు విడుదల చేయండని కోరారు. సేవాలాల్ పుట్టిన రోజును సెలవు దినంగా ప్రకటించాలని.. సంగారెడ్డి, రాం మందిర్, సదాశివ పేట వరకు మెట్రో వేయాలని డిమాండ్ చేశారు. భావోద్వేగాల మధ్య ప్రయోజనాలు పొందాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. తెచ్చుకున్న తెలంగాణలో సంపద పంచి అభివృద్ధి సాధించాలన్నారు.
Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు