Kiren Rijiju: దేశ ప్రజలను విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది.
Tripura: త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా నేడు మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. రాష్ట్రంలో బీజేపీని వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో మాణిక్ సాహా కీలకంగా పనిచేశారు. దంతవైద్యుడు, రాజకీయనాయకుడిగా సాహాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అగర్తలా వివేకానంద మైదాన్ లో ప్రమాణస్వీకారం జరగనుంది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై రాజకీయ కారణాలతో ఆప్ నేతను టార్గెట్ చేశారన్న అభిప్రాయాన్ని తొలగించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నెయిఫియు రియో ఐదోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. తాజా ఎన్నికల్లో అధికారానికి అవసరమైన పూర్తి మెజార్టీ సాధించిన ఎన్‌డీపీపీ కూటమి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఐదోసారి సీఎంగా నెయిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు.
PM Modi to Attend Oath Ceremonies of Nagaland, Meghalaya CMs: ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సంకీర్ణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఇక నాగాలాండ్ లో నేషనలిస్టు డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్డీపీపీ) నేత నెపియూ రియో నేతృత్వంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళవారం రెండు రాష్ట్రాల…
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యూకేలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే లండన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీని గుడ్డిగా విశ్వసించే ఎవరికైనా మద్దతు ఉంటుందని, మోదీపై, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే వారిపై దాడులు జరుగుతున్నాయని, బీబీసీపై ఇదే విధంగా దాడి జరిగిందని ఆయన అన్నారు.
Karnataka: కర్ణాటక రాష్ట్రీయ హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రధాని నరేంద్రమోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రధాని పేరు లేకుండా ఫోటోలు ఉపయోగించకుండా ఓట్లు దండుకోవాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.