PM To Open Karnataka Expressway: మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ పెద్దలతో పాటు ప్రధాని నరేంద్రమోదీ వరసగా కర్ణాటకకు వెళ్తున్నారు. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని ఆరుసార్లు కర్ణాటకకు వెళ్లారు.
Gujarat passes resolution On BBC Documentary on Modi: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్(బీబీసీ) ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ దేశంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఇటు భారత్ లోనూ.. అటు బ్రిటన్ లోనూ ఈ డాక్యుమెంటరీపై విమర్శలు రావడంతో పాటు పలువురు సమర్థించారు. భారత దేశం ఏకంగా దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీ ప్రమేయం…
వాణిజ్యం, పెట్టుబడులతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే మార్గాలను అన్వేషించడానికి జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా మార్చి 20, 21 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు.
PM Modi To Visit Karnataka On March 12: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ నెల 12న కర్ణాటకకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపుగా రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రతిష్టాత్మక 10 వరసల మైసూర్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మాండ్యాలో ప్రారంభించనున్నారు. ఆ తరువాత హుబ్బళ్లి-ధార్వాడలో వివిధ అభివృద్ధి…
Mandya MP Sumalatha extends 'full support' to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు.
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తో భేటీ అయ్యారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో వరసగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఇప్పటికే ఈ ఆంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ప్రధానితో నరేంద్రమోదీ ఈ అంశాన్ని తేలవనెత్తారు.
భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ సందర్శించారు. ఆంథోనీ అల్బనీస్ ఈరోజు క్యారియర్‌లో గార్డ్ ఆఫ్ హానర్‌ను అందుకున్నారు.
Kiren Rijiju: దేశ ప్రజలను విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది.