ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. ప్రకటనలపై అధిక వ్యయం కారణంగా ఢిల్లీ బడ్జెట్‌కు అంతకుముందు రోజు కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
PM Narendra Modi: ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచ దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ప్రశంసిస్తున్నారు. అయితే మనం శతృవుగా భావించే చైనాలో కూడా మోదీకి ఆదరణ పెరుగుతోంది. ఏకంగా మోదీకి ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. చైనా ప్రజల నుంచి ఇంతకుముందు ఏ విదేశీ నేతకు ఇంత ఆదరణ రాలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. చైనా ప్రజలు మాత్రం మోదీని అసాధారణ నేతగా పరిగణిస్తున్నారు.
దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలకోపన్యాసం చేస్తూ.. భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోందని అన్నారు.
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర విందుకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని సమాచారం. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్-అమెరికా మధ్య బలపడుతున్న బంధానికి ఈ విందు ఓ కీలక సంకేతంగా నిలవనుంది.
Mega Textile Parks: దేశంలో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్స్‌టైల్ 5ఎఫ్(ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్) విజన్ కి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో పీఎం మిత్ర మెగా…
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆస్కార్ ఈవెంట్స్ లో తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఇంటర్నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేశాడు చరణ్. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ముందుగా ఎన్టీఆర్, ఈరోజు రాజమౌళి అండ్ టీం హైదరాబాద్ వచ్చేసారు కానీ చరణ్ మాత్రం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ఉపాసనతో పాటు ఢిల్లీలో ల్యాండ్ అయిన చరణ్ కి గ్రాండ్ వెల్కమ్…
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 16 మంది జాలర్లు, 102 మత్స్యకార బోట్లను త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలను ప్రారంభించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.