ఎవరు? ఆ లీకు వీరులెవరు..? ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీల మీటింగ్ వివరాలను బయటికి చెప్పిందెవరు?.. దీని గురించి బయట ఎక్కడా చర్చ జరక్కూడదని స్వయంగా మోడీ చెప్పినా సరే.. లీక్ చేసింది ఎవరు? అనుమానపు చూపులు ఎటువైపు ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై ఆరా తీశారు. ఇప్పటిదాకా…
Rahul Gandhi: ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మహాత్మాగాంధీ ఆదర్శాలకు అవమానమని అన్నారు.
అరబ్ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్‌లోని అమ్మాన్లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు II అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్, ప్రధాని జాఫర్‌తో సమావేశం కానున్నారు. ప్రధాని…
కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 18 వరకు మూడు విదేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.
యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం దేశ వ్యాప్తంగా అమలవుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకం పేరును మార్చాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు ప్రత్యేక విందు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గురువారం సాయంత్రం కళ్యాణ్ మార్గ్‌లో తన నివాసంలో ఈ విందు ఇచ్చారు.
PM speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. యూఎస్ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. మోడీ, ట్రంప్‌లు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, ఎనర్జీ, డిఫెన్స్ రంగాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఎన్నికల సంఘంతో అధికార పార్టీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.