PM Modi: అస్సాంలో మోడీ పర్యటన.. మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం
- అస్సాంలో మోడీ పర్యటన
- మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం
- ఈశాన్య భారత్‌లో ఇది మొట్టమొదటి అత్యవసర ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ అస్సాంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఇక మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. ముందుగా దిబ్రూగఢ్ జిల్లాలోని చాబువా ఎయిర్‌ఫీల్డ్‌కు చేరుకున్న ఆయన.. అనంతరం మోరన్‌లోని ELFకు చేరుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130 విమానంలో వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.. మోడీని వేదికపైకి స్వాగతించి సత్కరించారు. ఇక మోరాన్ బైపాస్‌లోని అత్యవసర ల్యాండింగ్ సౌకర్యంపై నుంచి సుఖోయ్ టేకాఫ్ అయింది. ప్రధానమంత్రి మోడీ ప్రత్యక్షంగా వీక్షించారు. గత మూడు నెలల్లో అస్సాంకు మోడీ రావడం ఇది మూడవసారి. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
ELF ప్రత్యేకత ఇదే..
ఈశాన్య భారతదేశంలో ఇది మొట్టమొదటి అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ. ఇక్కడ నుంచి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు ల్యాండింగ్.. టేకాఫ్ అవుతాయి. భారత వైమానిక దళంతో సమన్వయంతో అభివృద్ధి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాలను ల్యాండింగ్, టేకాఫ్ చేయొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు లేదా వ్యూహాత్మక అవసరాల సమయంలో కూడా సహాయ, రెస్క్యూ కార్యకలాపాలకు ఇది కీలకం కానుంది. ఈ నిర్మాణం 40 టన్నుల వరకు బరువున్న యుద్ధ విమానాలను, 74 టన్నుల గరిష్ట టేకాఫ్ బరువు కలిగిన రవాణా విమానాలను నిర్వహించగలదు. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త సౌకర్యం జాతీయ అత్యవసర పరిస్థితులు, మానవతా కార్యకలాపాల సమయంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు, రవాణా విమానాలకు అత్యవసర ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్యం గల ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగపడునుంది.

మోరాన్ చైనా సరిహద్దు నుంచి దాదాపు 300 కిలోమీటర్లు.. మయన్మార్ సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండటం విషయం. ELF వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశంలో ఉంది. బుధవారం నుంచే ఎయిర్‌స్ట్రిప్‌లో ట్రయల్ రన్‌లు జరుగుతున్నాయి. విమానాలు ల్యాండ్ అవ్వడం, టేకాఫ్ అవ్వడం చూడటానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.

#WATCH | Assam: Indian Air Force's Sukhoi Su-30MKI takes off from the Emergency Landing Facility (ELF) on Moran Bypass in Dibrugarh. PM Narendra Modi and others watch the take off.
(Video: DD) pic.twitter.com/1s36cl7PpH
— ANI (@ANI) February 14, 2026
#WATCH | Assam: Prime Minister Narendra Modi being welcomed on the stage by CM Himanta Biswa Sarma and Union Minister Sarbananda Sonowal, in Dibrugarh.
PM Modi landed at the Emergency Landing Facility (ELF) on Moran Bypass in Dibrugarh.
(Video: DD) pic.twitter.com/7ruxj9J8eF
— ANI (@ANI) February 14, 2026
VIDEO | Prime Minister Narendra Modi (@narendramodi) will today inaugurate the Kumar Bhaskar Varma Setu during his day-long visit to Assam. The bridge spans the Brahmaputra River, connecting Guwahati with North Guwahati.
The six-lane extradosed prestressed concrete (PSC) bridge,… pic.twitter.com/34E6GfvqG4
— Press Trust of India (@PTI_News) February 14, 2026
#WATCH | Assam will witness a historic moment today as Prime Minister Narendra Modi will land at the Emergency Landing Facility (ELF) on Moran Bypass in Dibrugarh, where he will witness the aerial display of fighters, transports and helicopters. The ELF is the first of its kind… pic.twitter.com/yPIZXywbGl
— ANI (@ANI) February 14, 2026


తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?