PM Modi: చొరబాటుదారుల కోసం మమతా బెనర్జీ కోర్టులకు వెళ్తోంది..
- తృణమూల్ అక్రమ వలసదారుల్ని రక్షిస్తోంది..
- వారి కోసం కోర్టులకు వెళ్తోంది..
- మమతా బెనర్జీపై మోడీ ధ్వజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో లేవనెత్తారు. రాష్ట్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారుల్ని రక్షించడానికి తృణమూల్ కాంగ్రెస్ కోర్టుకు వెళ్తోందని అన్నారు. మమతా బెనర్జీ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: PM Modi: ‘‘నో విజన్, నో ఐడియా, నో ప్లాన్’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ధ్వజం..
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు SIRకి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. దేశ యువత కోసం ఉద్దేశించిన అవకాశాలను అక్రమ వలసదారులు దొంగిలిస్తు్న్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎంసీ కేవలం అధికారం గురించి మాత్రమే ఆలోచిస్తుందని, ప్రజల గురించి కాదని అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు కూడా అక్రమ వలసదారుల్ని తమ భూభాగాల నుంచి బహిష్కరిస్తున్నాయని, కానీ మన దేశంలో కొన్ని గ్రూపులు ఉద్దేశపూర్వకంగా అక్రమ వలసదారుల్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అక్రమ వలసదారుల గురించి మాట్లాడే నేతల్ని దేశ యువత ఎలా అంగీకరించగలదని ప్రశ్నించారు.
చొరబాటుదారులు వారి ఉద్యోగాలు, జీవనోపాధిని లాక్కుంటున్నారని, గిరిజనుల భూమిని లాక్కుంటున్నారని, మన కుమారులు-కుమార్తెలక భద్రత, భవిష్యత్తుకు ముప్పు సృష్టిస్తున్నారని అన్నారు. తృణమూల్ దాని మిత్రపక్షాలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. “కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, లేదా వామపక్షాలు అయినా, వారు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారని వారంతా తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?