PM Modi: ప్రధాని మోడీకి ఢాకా ఆహ్వానం..?
- బంగ్లా ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ ఘన విజయం..
- ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రెండేళ్ల అనిశ్చితి తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. దివంగత మా ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా పదవీస్వీకారం చేయనున్నారు. ఇన్నాళ్లు బంగ్లాను పాలించిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారానికి తెరపడనుంది.
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ఇదిలా ఉంటే, యూనస్ సమయంలో భారత బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూనస్ పాకిస్తాన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వారిలో సంబంధాలను పెంచుకున్నాడు. భారత వ్యతిరేకత, హిందువులపై వ్యతిరేకతను నూరిపోయడంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే, వీటన్నింటిని పక్కన పెట్టి, ప్రధాని నరేంద్రమోడీని ఢాకాకు ఆహ్వానించాలని బీఎన్పీ అనుకుంటోంది. తారిక్ రెహ్మాన్ ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్రమోడీని ఆహ్వానించాలని యోచిస్తోంది. ప్రాంతీయ దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ప్రధాని మోడీ కీలక ఆహ్వానితుల్లో ఉంటరని భావిస్తున్నారు.
ప్రధాని మోడీ, బంగ్లాకు కాబోతున్న ప్రధాని తారిఖ్ రెహ్మాన్‌తో మాట్లాడిన తర్వాత, ఈ పరిణామం చోటుచేసుకుంది. తారిక్ గెలిచిన తర్వాత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక వేళ ఆహ్వానం అంది, ప్రధాని మోడీ ఢాకా వెళ్తే, భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మళ్లీ చిగురించే అవకాశం ఉంది. ప్రమాణస్వీకార తేదీని ఇంకా ధ్రువీకరించడకపోవడంతో, విదేశీ నాయకుల హాజరును నిర్ధారించలేదు.
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!