యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. తొలిరోజు జర్మనీలో పర్యటించిన ఆయన.. రెండో రోజున అక్కడి నుంచి కోపెన్హాగన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడ మోడీకి డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సన్ స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి డెన్మార్క్ ప్రధాని అధికారిక నివాసం మానియన్ బోర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఫ్రెడరిక్సన్.. తన నివాసం మొత్తాన్ని మోడీకి చూపించారు. భారత పర్యటనకు వచ్చినప్పుడు.. తనకు మోడీ గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్‌ను కూడా…
* విశాఖ రానున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. రేపు సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం సత్యనారాయణ * నేటి నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం *నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం *నేడు టీడీపీ నేత నారా లోకేష్ కర్నూలు పర్యటన. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత రాజవర్ధన్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్న…
* ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే. దేశవ్యాప్తంగా వేడుకల్లో పాల్గొననున్న కార్మికులు. * నేడు జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ అంత్యక్రియలు. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి రానున్న హోం మంత్రి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని *పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి రోజా పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి రోజా. మార్టేరులో జరుగుతున్న బాస్కెట్ బాల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా *తిరుపతిలో నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో…
విజ్ఞాన్ భవన్ లో న్యాయ సదస్సు ప్రారంభమయింది. ఈ సదస్సులో న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు. సదస్సుల్లో ప్రధాని మోడీ,సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, వివిధ రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు,అధికారులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్‌కు మర్యాద తెలియదని మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బుధవారం నాడు ప్రధాని మోదీ కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.…
ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే జగన్ ఉండనున్నారు. ఈనెల 30న శనివారం జరగనున్న జ్యుడిషీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో…
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు అధినేత కేసీఆర్. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ప్లీనరీ తీర్మానం చేసింది. ప్రత్యమ్నాయ ప్రజల అజెండాతో అమెరికా తరహా అభివృద్ధి సాధ్యమన్నారాయన. రాబోయే ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు తామే గెలుస్తామని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. ఈ ప్లీనరీలో మొత్తంగా 13 తీర్మానాలు ప్రవేశపెట్టారు. అలాగే కేంద్రంపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కేసీఆర్. రాష్ట్రం…
దేశవ్యాప్తంగా పెట్రో ధరలపై చర్చ సాగుతూనే ఉంది.. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు.. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఎలా ఉన్నాయో తెలుపుతూ.. పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఇక, తెలంగాణలో పెట్రో ధరలకు కారణం ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీయేనని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ పేరు ప్రస్తావించడంలో మంత్రి కేటీఆర్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది.. దీంతో.. ప్రధాని మోడీకి సోషల్ మీడియా…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. 2జీ సర్వీసులను 4జీకి మార్చేందుకు రూ. 2,426.39 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2,343 బీఎస్ఎన్ఎల్ టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయనుంది సర్కార్.. దీంతో, మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం కూడా సులభం అవుతుందని…