BJP Vijaya Sankalpa Sabha: నగరానికి కాషాయం కళ.. రెపరెపలాడుతున్న జెండాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో కాషాయి జెండాలు రెపరెపలాడుతున్నాయి. జూలై 3న బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించేందుకు భారీ ఏర్పట్లపై బీజేపీ శ్రేణులు పకడ్బందీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. నగరంలో ఎక్కడ చూసిన కాషాయి జెండాలు రెపరెపలాడుతుండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరికి పార్టీ చేరువయ్యేలా కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారు బీజేపీ శ్రేణులు. మోదీ సభకు భారీగా జనాన్ని తరలించడానికి పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో ప్రణాళికలు రూపొందించింది. ఈనేపథ్యంలో.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించేలా కసరత్తు చేస్తున్నారు.
నగరంలో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గసమావేశాలకు గురు, శుక్రవారం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. కాగా.. తెలంగాణ సంపర్క్ అభియాన్ పేరిట నిర్వహించే ఈ భేటీల్లో పాల్గొనడానికి దేశ నలుమూలల నుంచి బీజేపీ ముఖ్య నాయకులు.. కేంద్ర మంత్రులు.. కేంద్ర మాజీ మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది (2023)లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి.. ముఖ్య నేతలంతా దళిత వాడలనూ సందర్శిస్తారు. ఇక రాత్రిపూట నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లల్లో ముఖ్య అతిథులు భోజనాలు చేయనున్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
ఈనేపథ్యంలో.. మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లోని హోటల్స్ బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో కళకళలాడుతున్నాయి. నగరంలోని హోటల్స్‌లో 60 శాతానికి మించి రూమ్‌లు బుక్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ముుఖ్యంగా సమావేశాలు జరిగే నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ హోటల్‌లో అన్ని రూమ్‌లనూ మూడు రోజుల పాటు ఆ పార్టీ బుక్ చేసుకుంటే, మాదాపూర్‌తో పాటుగా బంజారాహిల్స్‌లోని కొన్ని హోటల్స్‌లో పెద్ద సంఖ్యలో రూమ్‌లను ఆ పార్టీ నేతలే బుక్ చేసుకున్నారు. అయితే.. మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో ఉన్న స్టార్ హోటల్స్‌లో 60కి మించి బుకింగ్స్ జరిగాయని కొన్ని హోటల్స్ జనరల్ మేనేజర్లు అంటున్నారు.
YSRCP: వైసీపీలో వెన్నుపోట్లు..! ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..