భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో.. సిటీలో ఎటు చూసిన తెలంగాణ ప్రభుత్వ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపిస్తున్నాయి.. ప్రభుత్వ పథకాలు, వాటితో ప్రయోజనాలు, చేపట్టిన ప్రాజెక్టులు.. ఇలా అనేక విషయాలను వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు.. అయితే, ఇదే సమయంలో.. తమకు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పెట్టుకునే వీలు లేకుండా.. టీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత లక్ష్మణ్.. మెట్రో పిల్లర్లు కూడా కబ్జా చేశారు.. అధికారం ఉందని, డబ్బు ఉందని మీరు చేస్తున్న ప్రతి దానిని ప్రజలు గమనిస్తున్నారు.. వాళ్లు చీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. ఇక, హెచ్‌ఐసీసీ ముట్టడికి పిలుపులపై స్పందించిన లక్ష్మణ్.. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిరసనలు తెలిపే అధికారం ఉంది.. కానీ, సభను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని హితవుపలికారు లక్ష్మణ్.
Read Also: PM Modi security: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు..
ఇక, తెలంగాణ గడ్డ మీద భాగ్యనగర్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. బీజేపీ అగ్ర నాయకత్వం హాజరు అవుతున్న ఈ మీటింగ్స్ చారిత్రాత్మక సమావేశాలు… 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు లక్ష్మణ్.. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు విజయ సంకల్ప సభగా పేరు పెట్టామని తెలిపిన ఆయన.. అధర్మం పైన ధర్మం గెలుపు కోసం… కుటుంబ, అవినీతి పాలన కు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తారనే ఈ సంకల్ప సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ కోసం అమరులు అయిన వారి కన్న కలలు నెరవేరుస్తామని చెప్పేందుకే సంకల్ప సభ అన్నారు. అయితే, కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు…. ఫ్లెక్సీ రాజకీయాలు చేసే స్థాయికి కేసీఆర్ దిగిపోయారు అంటూ ఫైర్ అయ్యారు.. పుత్ర వాత్సల్యంతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. స్వచ్ఛ, సమర్థ, నీతివంతమైన పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. వివిధ కమ్యూనిటీలకు చెందిన 16 సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు బీజేపీ నేత లక్ష్మణ్.