మోడీ ప్రధానిగా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు దేశ రక్షణ కోసం మోడీ చేసిన కృషి అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. మన వైపు చూడాలంటే నే పాకిస్తాన్ భయపడే స్థితికి మోడీ తీసుకు వచ్చారని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్యంలో జనరిక్ మందుల ద్వారా తక్కువ ధరకు నాణ్య మైన…
బీజేపీ అధిష్టానం తెలంగాణ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ఇందుకు అనుకూలంగా మార్చుకోనున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఎందుకు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా వివరించాలని హైకమాండ్ ఆదేశించింది. సమావేశాల గురించి ప్రతీ బూత్ స్థాయిలో తెలిసే విధంగా…
ప్రతీ రాష్ట్రం అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ చరిత్ర పోరాటాలతో నిండి ఉందని.. తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఏళ్ల తరబడి పోరాడి త్యాగాలు చేశారని ఆయన అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా జూన్, 2014న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణకు ఏం నిధులు ఇవ్వలేదని…
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర…
కొందరు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఐటీ మంత్రి చైనాను పొగుతున్నారని.. అక్కడ ఉన్నది మిలిటరీ రూల్ అని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే ఊరుకోరని అన్నారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలు కూడా చైనా చెప్పదని.. చైనా ప్రభుత్వం చెప్పిందే రాసుకోవాలని తెలిపారు. కేటీఆర్ గొప్పగా చెబుతున్న చైనాలో ముస్లింలను చంపుతున్నారని.. అక్కడి ప్రభుత్వానికి…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. హైదరాబాద్ కేంద్రంగా జూలై 2,3 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల వేదిక గురించి ఈ రోజు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్.సంతోష్ హైదరాబాద్ లో పర్యటించిన వారు హెచ్ఐసీసీ వేదికను ఖరారు చేశారు. కార్యవర్గ సమావేశాలపై రాష్ట్ర నేతలైన విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి,…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6…
జమ్మూకశ్మీర్లో కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు, హత్యల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కశ్మీరీ పండిట్లు 18 రోజులుగా ధర్నా చేస్తుంటే.. బీజేపీ ఎనిమిదేళ్ల పాలన వేడుకల్లో బిజీగా ఉందని ఆరోపించారు. మంగళవారం కుల్గామ్లో ఉపాధ్యాయురాలు రజనీ బాలాపై కాల్పులు జరుపడంతో ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో రాహుల్ స్పందించారు. ‘లోయలు శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని గారూ, ఇది సినిమా కాదు నిజం. కశ్మీర్లో గత ఐదు…
దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని.. రైతులకు భారం పడకుండా భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో రూ. 2000 చొప్పున 6000 అందిస్తుందని చెప్పారు. రైతును రాజు చేయాలనే కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అహర్నిశలు…
ఆర్టీసీ నష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి కాపాడుకుంటోందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని అన్నారు. కేంద్రం మాత్రం ఉన్న సంస్థల్ని అమ్ముకుంటోందని.. కార్మికులకు లాభం చేకూర్చే 40 చట్టాలను తీసేసి కేవలం నాలుగు కార్మిక చట్టాలను తెచ్చారని విమర్శించారు. కార్మికుల హక్కులను హరించే ఈ నాలుగు చట్టాలను తీసేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు బీజేపీ…