ఎంతైనా ఖర్చును భరిస్తాం.. కానీ మా రైతులను బాధపెట్టం అని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ కలోల్లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ‘సహకార్ సే సమృద్’ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటుందని.. ఇందులో ఒక్కో 50 కిలోల యూరియా బ్యాగ్ కు రూ.3500 చెల్లిస్తున్నామని.. అయితే రైతులకు మాత్రం బ్యాగ్ రూ. 300…
ఢిల్లీ నుండి మోడీ వచ్చి ఒక్క మాట చెప్పారా.. రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా.? మనల్ని చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని, అమిత్ షా, మోడీ వచ్చారు… పేదల కోసం, అభివృద్ధి కొసం ఒక్క మాట చెప్పలేదని ఆయన మండిపడ్డారు. రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొన…
మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పేద ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్న మోడీని ఇవ్వమని ఎందుకు అడగలేదు బండి సంజయ్ అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా 2కోట్ల ఉద్యోగాల గురించి మోడీని ఎందుకు అడగలేదని ఆయన అన్నారు. ఒక్కరోజు కూడా గుడికి పోని బండి సంజయ్ శివలింగల మీద మాత రాజకీయమా… మతాల పేరుపై ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది ప్రజలు…
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై టూర్ లో తమిళ భాషపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడులో రూ. 31,000 కోట్లతో పలు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తమిళ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యావిధానం భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తుతందని.. సాంకేతిక, వైద్య కోర్సులను స్థానిక భాషల్లో అభ్యసించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. దీని వల్ల తమిళ యువతకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. తమిళ భాష శాశ్వతమైనదని..తమిళ సంస్కృతి…
ప్రధాని హైదరాబాద్ పర్యటన తరువాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. దాదాపు రూ. 31,000 కోట్లతో 11 డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లో పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళనాడులో పర్యటిస్తున్న మోదీకి ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా హిందీ లాగే తమిళాన్ని అధికార భాష చేయాలని.. మద్రాస్…
ప్రధాని మోడీ నేడు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మోడీ మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని.. అలాంటి త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసమో కాదన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ…
ప్రధాని మోడీ హైదరాబాద్లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో హెచ్సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో… పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజల పేరుందని, తెలంగాణ…
బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని మోడీ నేడు హైదరాబాద్లోని ఇండియస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు…