ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళను.. చింపి చిల్లర పంచాయతీ పెట్టిన వాళ్ళ కండ్లల్ల కారం పెట్టాలి అంటూ నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన పిల్లలు జైల్లో ఉన్నారని, వీటిపై చర్చ చేయడం మరిచిపోయారంటూ ఆయన మండిపడ్డారు. మోడీ క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి..బండి సంజయ్ లు అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలన్న రేవంత్.. తెలంగాణ అమరులను అవమానించేలా మోడీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు.
మోడీకి వంటలు చేస్తున్న యాదమ్మ… వంటల్లో కొంచెం ఉప్పు కారం ఎక్కువ వెయ్.. కంచాల్లో కాదు.. కండ్లల్ల పెట్టు.. తెలంగాణ నీ మోసం చేస్తున్నందుకు బుద్ది చెప్పు అంటూ ఆయన విమర్శించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకో.. అగ్నిపథ్ పై కేసీఆర్‌నీ స్టాండ్ ఎంటో చెప్పు.. అసెంబ్లీ పెట్టి వ్యతిరేక తీర్మానం చేయ్.. తెలంగాణ గౌరవ ప్రతిష్టను కల్లు కాంపౌండ్ లో చిల్లర పంచాయతీ చేయకండని ఆయన మండిపడ్డారు.